కారేపల్లి, మహ: కారేపల్లి మండలం మేకలతండా కు చెందిన పలువురు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేకలతండాకు చెందిన బీఆర్ఎస్ లీడర్ భూక్యా సాములు, బీజేపీ లీడర్ భూక్యా సురేష్ వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి కారేపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు. గ్రూపు రాజకీయాలకు అవకాశం లేకుండా అందరూ ఐక్యంగా పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి నాయక్, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కబీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 115







