జగిత్యాల, మహా : ఆగస్ట్15 భారత స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తీరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పట్టణ అధ్యక్షుడు దోనికేల నవీన్ తో కలిసి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ప్రారంభించారు. రామాలయం నుండి కొత్త బస్టాండ్ మీదుగా పాత బస్టాండ్ వరకు 100 మీటర్ల పొడవు గల భారీ జెండాతో 2000 వేల మంది విద్యార్థులు తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, పట్టణ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, పట్టణ అధ్యక్షుడు దోనికేల నవీన్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హార్ ఘర్ తీరంగాలో భాగంగా ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఎంతో మంది త్యాగాల వల్ల దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. దేశంలోని పౌరులను ఐక్యం చేయడం కోసం, దేశ భక్తిని చాటిచెప్పడం కోసం హార్ ఘర్ తీరంగా ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు.. వందేమాతర గీతాన్ని పార్లమెంట్ లో చట్టబద్ధం చేయడం గొప్ప విషయం అన్నారు. దేశం కోసం ధర్మం కోసం బీజేపీ పార్టీ పని చేస్తుందన్నారు.








