Mahaa Daily Exclusive

  బాలింతలు, నవజాత శిశువుల సంరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయం..

Share

•గుంటూరు సర్వ జన ఆసుపత్రి లో అధునాతన తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కందుల దుర్గేష్

గుంటూరు, : మహా

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించి మాతా, శిశు మరణాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రవేశపెట్టినట్లు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ తెలిపారు.

బుధవారం గుంటూరు నగరంలోని జిజిహెచ్ ప్రాంగణంలో గల కానూరి జింఖానా స్త్రీ శిశు ఆరోగ్య కేంద్రం వద్ద స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తో కలిసి మంత్రి 18 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించారు.

ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గర్భిణులను ఆస్పత్రికి తీసుకురావడం, ప్రసవానంతరం బాలింతలను, బిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడానికి ఈ వాహనాలు ఉపయోగపడతాయన్నారు. ఎయిర్ కండిషన్ తో కూడిన, ఎయిర్ బ్యాగ్‌లు కలిగిన పూర్తి సురక్షితమైన వాహనాలన్నారు. గర్భిణులు మరియు బాలింతలు 102 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఉచితంగా ఈ సేవలను పొందవచ్చునన్నారు. వారికి తోడుగా ఆసుపత్రి సిబ్బంది కూడా వాహనంలో ఉంటారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ప్రారంభమైన ఈ కార్యక్రమంను గుంటూరు జిల్లాలో ఈరోజు ప్రారంభించామని, జిల్లాకు 18 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యసాధనలో భాగంగా ఈ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు.

ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. దుర్గాప్రసాద్, డిఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి, డిసిహెచ్ఎస్ డా. రంగారావు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Latest