- ఖానాపూర్ పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
- వేడుకలకు హాజరైన కౌన్సిలర్ భార్గవిరాజు
- స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ఆకట్టుకున్న విద్యార్థులు
ఇబ్రహీంపట్నం ఆగస్టు 15 మహా:
ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలం, ఖానాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ కౌన్సిలర్ భార్గవిరాజు, జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జెండావిష్కరణ చేసిన అనంతరం జాతీయగీతం ఆలపించి, నాడు స్వతంత్రం కోసం, స్వాతంత్ర సమరయోధులు చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల భవనానికి సొంత నిధులతో రంగులు వేయించిన కౌన్సిలర్ భార్గవి రాజును సన్మానించారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ఆకట్టుకున్నారు. వారు మాట్లాడుతూ… భారతదేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఎందరో మహనీయులు, తమ ప్రాణాలు త్యాగం చేసి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారని, వారి త్యాగాలను తరతరాలకు మరువలేనివని కౌన్సిలర్ తెలిపారు. గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులను చేర్పించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని పెద్దలకు యువకులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు అందిస్తున్న సేవలను గుర్తు చేశారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది గ్రామ పెద్దలు యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








