Mahaa Daily Exclusive

  పంద్రాగస్టు వేళ ప్రశంసా పత్రాల లొల్లి….

Share

  • పంద్రాగస్టు వేళ ప్రశంసా పత్రాల లొల్లి
  • వివిధ శాఖల్లో కష్టపడిన వారికి గుర్తింపు ఎక్కడ?

వరంగల్‌, మహా;

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరంగల్‌ జిల్లాలో వివిధ శాఖల ఉద్యోగులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 103 మందిని సత్కరించగా, ఇందులో దాదాపు సగం మంది పైగా పోలీసు శాఖకు చెందిన వారేనన్న చర్చ ఉద్యోగ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
పోలీసు సిబ్బందికి గుర్తింపు ఇవ్వడంపై అభ్యంతరం లేకపోయినా.. రెవెన్యూ, మున్సిపల్‌, బీఎల్‌ఓలు, అంగన్వాడీ సిబ్బంది తదితర విభాగాల్లో కష్టపడుతున్న వారికి కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇటీవల ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో రాత్రింబవళ్లు పనిచేసిన రెవెన్యూ సిబ్బంది, ఎన్నికల విధుల్లో నిరంతరం సేవలందిస్తున్న బీఎల్‌ఓలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తల్లో ఉత్తమంగా పనిచేసిన వారిని గుర్తించి ఉంటే మరింత ప్రోత్సాహం లభించేదని ఉద్యోగులు భావిస్తున్నారు.

ప్రశంసా పత్రం ఆర్థిక ప్రయోజనం ఇవ్వకపోయినా.. తమ కష్టాన్ని అధికారులు గుర్తించారనే గౌరవం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది.
అన్ని శాఖలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించేలా ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.

Latest