Mahaa Daily Exclusive

  కళాకారుడికి కలం చేయూత..! ప్రజా గాయకుడు నాగేంద్రకు అండగా నిలిచిన అశోక్ నాయక్..

Share

  • ప్రజా గాయకుడు నాగేంద్రకు అండగా నిలిచిన అశోక్ నాయక్
  • ఫోటోగ్రాఫిక్ పరికరాల వితరణ..

కారేపల్లి, మహా:ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా గాయకుడు నాగేంద్రబాబుకు బోడ అశోక్ నాయక్ అండగా నిలిచి ఫోటోగ్రఫీ పరికరాలను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా కారేపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు నాగేంద్రబాబును అభినందించి ఘనంగా సన్మానించారు.సీనియర్ జర్నలిస్టులు వార్త వెంకటేశ్వర్లు, పాలిక శ్రీనివాస్.చేతుల మీదుగా నాగేంద్రబాబుకు పరికరాలను అందజేసి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ ఒక దృశ్యాన్ని బంధించడంతో పాటు కాలాన్ని, చరిత్రను, మన జ్ఞాపకాలను భద్రపరిచే శక్తివంతమైన కళ అని అన్నారు.ఒక్క చిత్రం ఎన్నో మాటలు చెప్పగలదని, సమాజంలో చోటుచేసుకునే అనేక కీలక ఘటనలకు ఫొటో శాశ్వత సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు.ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాయకుడు నాగేంద్ర తన పాటల రచన, సంగీత సాధనకు వినియోగించుకునేందుకు అవసరమైన లైటింగ్ స్టాండ్,మౌత్ సంబంధిత పరికరాలను కారేపల్లి బోడ అశోక్ నాయక్ అందజేయడం అభినందనీయం అని అన్నారు.కళాకారుడి ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తే..సమాజం అందించే సహకారం అనేది అతని కళా ప్రయాణానికి గొప్ప బలమవుతుందనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది అని అన్నారు.ఫోటోగ్రఫీ,జర్నలిజం, సంగీతం,సాహిత్య రంగాల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి ఈ వేడుక ప్రతీకగా నిలిచింది.ఈ కార్యక్రమంలో గుగులోత్ శివ, జంగా నరేష్,కేతిమళ్ల సురేష్, మల్లేష్ యాదవ్,నరేష్,పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు.

Latest