Mahaa Daily Exclusive

  ఇళ్ల మంజూరులో తొలి ప్రాధాన్యత వారికే…!

Share

ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్య‌త క్రమాన్ని ఎంచుకోవాల‌ని పేర్కొన్నారు.

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం రేవంత్ ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు.

Latest