హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డీఏలు(కరవు భత్యం) మంజూరు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. 2024 జనవరి, జులై డీఏలను సర్కారు విడుదల చేసింది. రెండు డీఏలు కలిపి 6.27 శాతం పెరిగింది. దీనిని అక్టోబరు జీతంతో కలిపి ఉద్యోగు జీపీఎఫ్ ఖతాల్లో జమ చేయనుంది. సీపీఎస్ ఉద్యోగులకు మొదటి డీఏ 33, రెండో కరవు భత్యాన్ని 27 వాయిదాల్లో చెల్లించనున్నారు. డీఏల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు 2వేల500 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2024 నుంచి పెండింగ్లో ఉన్న డీఏల్లో రెండు మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. డీఏ బకాయిలను వాయిదాల్లో చెల్లిస్తారు. ఆర్థికంగా భారమైనప్పటికీ ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరుకు నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇటీవల తెలిపారు.








