Mahaa Daily Exclusive

  స్థానిక ఎన్నికలపై… హైకోర్టులో వైఎస్‌ఆర్‌సీపీ పిటిషన్లు…

Share

 

అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛా వాతావరణంలో, నిష్పాక్షికంగా నిర్వహించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు స్థానిక పోలీసుల జోక్యం లేకుండా ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ పార్టీ తరఫున హైకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. స్థానిక పోలీసుల తీరుపై నమ్మకం లేనందున నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ప్రక్రియ ముగింపు వరకు రక్షణ కోసం కేంద్ర సాయుధ బలగాలను (పారామిలిటరీ) మోహరించాలని తమ పిటిషన్లలో కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి ప్రతిపాదకులు ఎటువంటి భయందోళనలు లేకుండా నామినేషన్లు వేసేందుకు వీలుగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కల్పించాలని వైఎస్‌ఆర్‌సీపీ కోరింది. అంతేకాకుండా, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను నిరోధించేందుకు నామినేషన్ కేంద్రాలు, సున్నితమైన పోలింగ్ స్టేషన్లు, లెక్కింపు కేంద్రాల వద్ద 24 గంటల పాటు సీసీటీవీ నిఘాతో పాటు ప్రత్యక్ష ప్రసారం (లైవ్ వెబ్‌కాస్టింగ్) ఏర్పాటు చేసేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది.