Mahaa Daily Exclusive

  రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతిరెడ్డి నియామకం…

Share

అమరావతి, మహా .

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలిగా స్వాతిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల హక్కుల పరిరక్షణ, వారిపై జరిగే వివక్ష, వేధింపుల నివారణలో కీలక పాత్ర పోషించే అత్యున్నత కమిషన్‌లో ఆమెకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుదారుగా నిలిచిన స్వాతిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, వేధింపులు ఎదురయ్యాయి. రాజకీయ ఒత్తిళ్లు, అవరోధాలు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసినందుకు గుర్తింపుగా ఆమెకు ఈ పదవి దక్కినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాష్ట్రంలో మహిళల సమస్యల పరిష్కారానికి, వారి సాధికారతకు ఆమె విశేష సేవలందిస్తారని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.