చిక్కడపల్లి, మహా : కళా నిలయం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం త్యాగరాయ గాన సభలో నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీమతి ఫణి దుర్గ శిష్యురాల్లు,చిన్నారి ఎం. సహస్ర, ధన్విక తమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ప్రదర్శనల తో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు.







