Mahaa Daily Exclusive

  కొంగరకలాన్‌లో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి…

Share


  • కొంగరకలాన్‌లో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి…
  • కొంగరకలాన్‌లోని దుర్గామాత మండపాల సందర్శన..
  • అమ్మవారికి ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహణ..
  • అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే..

ఆదిభట్ల అక్టోబర్ 16 మహా:
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను శుక్రవారం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సందర్శించారు. గ్రామంలోని శివాలయం వీధి, కొంగరకలాన్ చౌరస్తా, బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన మండపాల వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే… దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ పండుగ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు, భక్తి, ఐక్యత, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. దుర్గామాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని మల్‌రెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, కొంగరకలాన్, ఆదిభట్ల డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెన్నమోని రమేష్ ముదిరాజ్, పల్లె రజనీకాంత్ గౌడ్, మాజీ కౌన్సిలర్ వనం శ్రీనివాస్ గౌడ్, కొత్త ప్రవీణ్ గౌడ్, నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.