- విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా
- జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల
విజయవాడ. మహా : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో సమాయత్తమవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీ ఎన్నికల్లో పార్టీ తరఫున రేసులో నిలబడే అభ్యర్థుల తొలి జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ సీనియర్ నాయకులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం గెలుపే ప్రామాణికంగా ప్రజాదరణ పొందిన నాయకులకు ఈ జాబితాలో స్థానం కల్పిస్తూ ఆమోదం తెలిపారు.
ఈ తొలి విడత జాబితాలో రెండు ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 ముఖ్యమైన మున్సిపాలిటీలకు అభ్యర్థులను ప్రకటించారు.
కార్పొరేషన్ల మేయర్/ అభ్యర్థులు:
ఏలూరు కార్పొరేషన్ : రెడ్డి అప్పలనాయుడు
విజయవాడ కార్పొరేషన్: వంగవీటి రాధాకృష్ణ
మున్సిపాలిటీల అభ్యర్థుల వివరాలు:
అమలాపురం : నల్లా శ్రీధర్
చిలకలూరిపేట : తోట రాజరాజేశ్వరి
గొల్లప్రోలు: కడారి తమ్మయ్య నాయుడు
నరసాపురం: కొత్తపల్లి శైలజ
నిడదవోలు: కల్లం జ్యోతి
పెడన: మట్టా శివపావని
పిఠాపురం: డాక్టర్ బీరా విజయ్ శేఖర్
పుత్తూరు: డి. ఏలుమలై
సాలూరు: గొర్లె విజయకుమారి
సామర్లకోట: పిట్టా జానకి రామారావు
తెనాలి: తోటకూర వెంకట రమణారావు
తిరువూరు: పి. మాధవి
మహిళలకు, స్థానికంగా ప్రజా సమస్యలపై పోరాడే నాయకులకు ఈ తొలి జాబితాలో పెద్దపీట వేశామని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే మిగిలిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకు సంబంధించి రెండవ జాబితాను కూడా విడుదల చేస్తామని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.








