కారేపల్లి,మహ: మండల పరిధిలోని మాదారం గ్రామపంచాయతీలో గల గోవింద్ తండాలో అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో శనివారం రూ.5,116 విరాళంగా అందజేశారు.గ్రామంలో అమ్మవారి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తమవంతు సహాయంగా ఈ మొత్తాన్ని అందించినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు,ఉపసర్పంచ్ మంగీలాలు,మాజీ ఎంపీటీసీ రవి,8వ వార్డు సభ్యుడు పాయం మునిందర్,బి.వంశీ, శివరాత్రి బాబు,బి.వీరన్న,బి. మల్లికార్జున్,వి.వీరన్న,జె. రవితో పాటు కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.








