Mahaa Daily Exclusive

  మహారాష్ట్రలో కలకలం సృష్టించిన పులి.

Share

  •  ముగ్గురు పశువుల కాపరులు మృతి.
  •  స్పెషల్ ఆపరేషన్తో పులిని బంధించిన అధికారులు.

చంద్రాపూర్,మహా.

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా తీవ్ర భయాందోళనలు సృష్టిస్తూ, ముగ్గురు పశువుల కాపరుల ప్రాణాలు తీసిన పెద్దపులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కింది. చంద్రాపూర్ జిల్లా సావళి అటవీ ప్రాంతంలో అధికారులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఆరేళ్ల వయస్సు గల టి-122 పులిని బంధించడంతో స్థానిక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత నెల రోజులుగా సావళి అటవీ పరిధిలోని ఐదు గ్రామాల్లో ఈ పులి సంచరిస్తూ తీవ్ర భీభత్సం సృష్టించింది. అడవిలోకి పశువులను కాయడానికి వెళ్లిన ముగ్గురు పశువుల కాపరులను ఈ పులి పొట్టనబెట్టుకోవడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా వణికిపోయే పరిస్థితి ఏర్పడటంతో గ్రామాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.

ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 27 నుంచి ఈ పులిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక భారీ ఆపరేషన్‌ను ప్రారంభించారు. రాత్రింబవళ్లు శ్రమించి, అటవీ ప్రాంతంలో నిఘా పెంచిన అధికారులు ఎట్టకేలకు ఆరేళ్ల T-122 పులిని బోనులో బంధించడంలో విజయవంతమయ్యారు. పులిని విజయవంతంగా బంధించడంతో సావళి అటవీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు ఎట్టకేలకు ఊరట చెందారు.