ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా పెద్దపల్లిలో యువవికాసం వేడుక సందర్భంగా ఆ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భారీ వరాలు కురిపించారు.
– పెద్దపల్లి లో రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్తో పాటు ఎలిగేడు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
– ఎలిగేడుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ మంజూరు చేశారు.
– పెద్దపల్లిలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడేషన్. రూ.51 కోట్ల అంచనాలతో పరిపాలనా ఆమోదం లభించింది
– మంథనిలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.22 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తర్వులు జారీ చేశారు.
– గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు అనుమతి
– పెద్దపల్లిలో ఫోర్ లేన్ బై పాస్ రోడ్డుతో పాటు దాదాపు రూ.352 కోట్లతో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్లు, రూ.10 కోట్ల అంచనాతో సబ్ స్టేషన్ల పనులు, రామగుండంలో నర్సింగ్ కాలేజీని ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం ప్రారంభించారు.








