Mahaa Daily Exclusive

  తెలంగాణలో ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు..

Share

  • ఆదిలాబాద్, నల్గొండ, గద్వాల్ జిల్లాలో ఏసీబీ తనిఖీలు

మహా ఎఫెక్ట్

రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్ట్ లలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక- ఎసిబి

 

హైదరాబాద్, మహా

తెలంగాణ వ్యాప్తంగా పలు ఆర్టీఏ చెక్ పోస్టులపై ఎసిబి మూకుమ్మడిగా దాడులు నిర్వహించింది. రవాణాశాఖ పరిధిలోని పలు చెక్ పోస్టులు అవినీతికి అడ్డాగా మారాయని, మహా పత్రికలో ప్రచురితమైన కథనాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ కావడంతో ఉన్నతాధికారులు నిఘా వేశారు. పలు చెక్ పోస్టులపై ఒకేసారి దాడి చేశారు. పాల్వంచ చెక్ పోస్ట్ తో పాటు పలు చెక్ పోస్ట్ లపై నిఘా ఉంచారు. పత్రికల్లో కథనాలు రావడంతో పలు చెక్ పోస్టుల అధికారులు ముందే అలర్ట్ అయ్యారు. దీంతో నిఘా ఉంచి సమయం చూసి అధికారులు దాడులు నిర్వహించనున్నారు. మహా పత్రికలో వరుస కథనాల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించగా, అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఎసిబి అధికారులు తెలిపారు. అదిలాబాద్, నల్గొండ, గద్వాల్ జిల్లాలో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఆదిలాబాద్‌లోని భోరాజ్, నల్గొండలోని విష్ణుపురం, గద్వాల్‌లోని అలంపూర్ చెక్‌పోస్ట్‌లో ఏసీబీ సోదాలు జరిగాయి. అక్రమాలు జరుగుతున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.1.78 లక్షలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు.

Latest