- తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్ని పిటిషన్ను కొట్టి వేసిన సర్వోన్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ, మహా : కోట్లాదిమంది వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను ఏపీ వెలుపలకు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసు విచారణను ఏపీ వెలుపల వేరే రాష్ట్రానికి మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, కేసు విచారణను ఏపీలోనే కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విచారణ పారదర్శకంగా జరగాలన్న ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు గతంలో సిట్ ఏర్పాటుకు ఆదేశించిన విషయం తెలిసిందే.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. దీనిపై పలువురు నేతలు, భక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఏపీలో విచారణ నిష్పాక్షికంగా జరగకపోవచ్చనే అనుమానంతో కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తాజాగా పరిశీలించి తిరస్కరించింది. ఏపీలోనే న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని తేల్చిచెప్పడంతో ఈ అంశంలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది.
ఈడీ చర్యలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి నెయ్యి కల్తీ వినియోగంపై ఈడీ కీలక చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిందితులు, వారి కుటుంబ సభ్యులు, సంస్థలకు చెందిన రూ.129.85 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీసు ఈ చర్యలు చేపట్టింది. అటాచ్మెంట్తో కలిపి ఈ కేసులో ఇప్పటివరకు జప్తు లేదా ఫ్రీజ్ చేసిన ఆస్తుల విలువ రూ.132.55 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.
డెయిరీల ఆస్తులు అటాచ్
ఈడీ చర్యల్లో భాగంగా భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ లకు చెందిన ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం. భోలే బాబా డెయిరీ ప్రమోటర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, వారి ఫ్యామిలీలకు చెందిన ఆస్తులపైనా ఈడీ చర్యలు తీసుకుంది. సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ కైలాష్ చంద్ మంగ్లా, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన స్థిర, చర ఆస్తులను






