Mahaa Daily Exclusive

  నరకాసురుని వధ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు..

Share

  • నరకాసురుని వధ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు
  • అభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలి
  • జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న

కార్పొరేషన్, మహా ;

నరకాసుర వధ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలు సమకూర్చాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు.

శుక్రవారం నగరంలోని రంగలీల మైదానం, రంగశాయిపేట మహాకాళి దేవాలయం వద్ద వేడుకల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాలు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అనంతరం వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు వెనుక సాయినగర్‌లో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ఏనుమాముల మార్కెట్ సమీపంలోని సుందరయ్య నగర్‌లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను పరిశీలించారు. హసన్‌పర్తిలోని ఎర్రగట్టు గుట్ట వద్ద నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్మాణాల నాణ్యతను పరిశీలించి, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంజయ్ కుమార్, రవికుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.