Mahaa Daily Exclusive

  ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఓ శకం ముగిసింది…

Share

  • ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఓ శకం ముగిసింది
  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస..
  • ‘ఉత్తరాంధ్ర టైగర్‌’గా ప్రత్యేక గుర్తింపు

విజయనగరం, మహా : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూశారు. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో విషాదం అలముకుంది. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగికి చెందిన విజయరామరాజును అభిమానులు ‘ఉత్తరాంధ్ర టైగర్‌’, ‘మన్యం పులి’ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. ఆయన మృతితో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసినట్లయింది.

1948 ఆగస్టు 4న జన్మించిన శత్రుచర్ల విజయరామరాజు చినమేరంగి సంస్థాన కుటుంబానికి చెందినవారు. సంస్థాన వారసత్వ నేపథ్యం నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన.. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ప్రజాప్రతినిధిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బలమైన ముద్ర వేశారు. 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో నాగూరు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన.. 1983, 1985 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించారు. తన రాజకీయ చతురత, ప్రజల్లో ఉన్న ఆదరణతో ఉత్తరాంధ్రలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.