Mahaa Daily Exclusive

  నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి….

Share

  • నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి
  • కరోనా నిబంధనల ఉల్లంఘన కేసుకు సంబంధించిన కేసుకు హాజరు

 

హైదరాబాద్, మహా : కరోనా నిబంధనల ఉల్లంఘన కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021లో జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా న్యాయస్థానానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి కోర్టుకు రానున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు ప్రాంగణంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా 2021 ఏప్రిల్ 11న నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా మాస్కులు ధరించకుండా కరోనా నిబంధనలు ఉల్లంఘించినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుల వాంగ్మూల నమోదు కోసం రేవంత్ రెడ్డి ఇవాళ స్వయంగా కోర్టుకు హాజరయ్యారు.