వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెకి)తో కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పుపట్టారు. ఈ ఒప్పందంలో భారీ అవినీతి చోటు చేసుకుందంటో ఆరోపణలు గుప్పించారు.
రేషన్ బియ్యం అక్రమాలపై విచారణ జరిపించడానికి ప్రభుత్వం స్పెషల్ సిట్ వేయడం సంతోషకరమేనని, మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన 1,750 కోట్ల రూపాయల ముడుపులపై విచారణ ఎక్కడ అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు షర్మిల. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ అదానీ అక్రమ డీల్‌పై ఎందుకు పెట్టలేకపోతున్నారని అన్నారు.
Post Views: 60








