Mahaa Daily Exclusive

  కరుకైన ఖాకీ చొక్కా వెనుక దాగి ఉన్న మానవత్వం

Share

  • చిన్నారులకు అండగా నిలిచిన ఎస్సై భోగం ప్రవీణ్ కుమార్
  • భార్య కస్తూరి పేరుతో రూ.20 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్

వర్ధన్నపేట, మహా;

కరుకైన ఖాకీ చొక్కా వెనుక మంచి మనస్సు మానవత్వం దాగి ఉందని నిరూపించుకున్నారు వర్ధన్నపేట ఎస్సై భోగం ప్రవీణ్ కుమార్. పోలీసు వృత్తిలోనే కాదు, మానవత్వంలోనూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. పోలీసులు అంటే కేవలం క్రమశిక్షణ, చట్టాన్ని అమలు చేసే అధికారానికి మాత్రమే ప్రతీక కాదని ఆ చొక్కా వెనుక కూడా ఓ మానవతా హృదయం దాగి ఉందని వర్ధన్నపేట ఎస్సై భోగం ప్రవీణ్ కుమార్ నిరూపించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అనాథగా మారిన చిన్నారుల భవిష్యత్తుకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. వర్ధన్నపేట పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఒంగూరి శ్రీకాంత్ ఇటీవల కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. దీంతో ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. ఆ కుటుంబం ఎదుర్కొంటున్న విషాదాన్ని, చిన్నారుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనను గుర్తించిన వర్ధన్నపేట ఎస్సై భోగం ప్రవీణ్ కుమార్ మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు.తన వంతు బాధ్యతగా ఆ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తుకు కొంతైనా ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో తన భార్య కస్తూరి పేరుతో రూ.20 వేల నగదును వారి పేరిట పోస్టాఫీస్‌ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించి తన ఉదారతను చాటుకున్నారు. విధి నిర్వహణలో నిత్యం ప్రజల రక్షణ కోసం శ్రమించే ఓ పోలీసు అధికారి వ్యక్తిగతంగా స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవడం పట్ల పలువురు ప్రముఖులు ద్వారా ప్రశంసలు అందుకున్నారు.