Mahaa Daily Exclusive

  బహుమతులకు బదులు పుస్తకాలు ఇవ్వండి..

Share

  • హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించిన గవర్నర్
  • నేటి యువత పుస్తకాల వైపు మళ్లాలి – జిష్ణుదేవ్ వర్మ

 

హైదరాబాద్, మహా: ఏదైనా శుభకార్యాలకు వెళ్లినప్పుడు బహుమతులకు బదులు పుస్తకాలను ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌ను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘పుస్తకాల్లో అనంతమైన జ్ఞానం ఉంటుంది. పుస్తకాలను నమిలి మింగేసేంత క్షుణ్ణంగా వాటిని చదవాలి. ఈ-బుక్స్‌లలో కంటే పుస్తకాల్లోనే ఎక్కువ మజా ఉంటుంది. పుస్తకాలను చదువుతుంటే రచయితతో నేరుగా మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. విశ్వం గురించి తెలియాలంటే పుస్తకాలు చదవాలి. నిరక్షరాస్యులకు ఆడియో బుక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. నేటి యువత పుస్తకాల వైపు మళ్లాలి. పెద్దలు కూడా ఆ దిశగా వారిని ప్రోత్సహించాలి’ అంటూ గవర్నర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. డిసెంబర్ 29తో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగియనుంది. ఈ నెల 19న దీనిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హరియానా గవర్నర్ బండారు దత్తాత్రేయతోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు ఈ బుక్ ఫెయిర్ ను సందర్శించారు.

Latest