Mahaa Daily Exclusive

  రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పురోగతి..

Share

  • టెండర్లు పిలిచిన కేంద్రం
  • హైదరాబాద్ ప్రగతికి కీలకమలుపు
  • రెండేళ్ళలో పూర్తిచేయాలని గడువు
  • రూ.5,555కోట్లతో నిర్మాణం
  • సంగారెడ్డి, గజ్వేల్, యాదాద్రి ప్రాంతాలకు మహర్ధశ

హైదరాబాద్, మహా

 

రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్ నార్త్ పార్ట్ కి టెండర్లను శనివారం కేంద్రం ఆహ్వానించింది. నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసం కేంద్రం టెండర్లు పిలిచింది. సంగారెడ్డి లోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు మొత్తం నాలుగు భాగాలుగా రోడ్డు నిర్మాణానికి టెండర్స్ కేంద్రం టెండర్లు పిలిచింది. రూ. 5,555 కోట్ల రూపాయల పనులకు కేంద్రం టెండర్లు పిలిచింది. రెండు సంవత్సరాల్లో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన విధించింది. సంగారెడ్డి జిల్లా గిర్మ్ పూర్ గ్రామం నుండి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు, రెడ్డిపల్లి గ్రామం నుండి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు, ఇస్లాంపూర్ నుండి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుండి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్లు, మొత్తం 161.5 కిలోమీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి కేంద్రం టెండర్లు పిలిచింది.

………………………..