ఏపీ: తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’కు ప్రజలు భారీగా హాజరయ్యారు. ప్రజా వేదికకు వచ్చిన ప్రజల నుంచి వినతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి స్వీకరించారు. వినతులు స్వీకరించి, వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తూ, బాధితుల సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలిసి ప్రజా వేదికలో వచ్చిన వినతులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.








