వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఐదు రోజుల సెలవులు ప్రకటించినట్లు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూలేపాక నిర్మల ఓ ప్రకటనలో తెలిపారు. 11న శనివారం వారాంతపు సెలవు, 12వ తేదీ ఆదివారం వారాంతపు సెలవు, 13వ తేదీ సోమవారం భోగి పండుగ, 14వ తేదీ సంక్రాంతి పండుగ, 15వ తేదీ బుధవారం కనుమ పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి గురువారం 16వ తేదీ నుంచి మార్కెట్లో యథావిథిగా క్రయవిక్రయాలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు, కార్మికులు, వ్యాపారులు గమనించి సహకరించాలని పేర్కొన్నారు.








