నా రాజకీయ జీవితం గురించి మీరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం…ఆక్షేపణీయంగా ఉన్నాయంటూ ఎంపీ దర్మపురి అరవింద్ పై మంత్రి తుమ్మల భగ్గుమన్నారు. ఈ స్థాయికి దిగజారి మీరు మాట్లాడతారని తాను ఊహించలేదని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం పట్ల అవగాహన రాహిత్యమో, సమాచార లోపమో తెలియదు కానీ మీ వ్యాఖ్యలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కానివని స్పష్టం చేశారు.
Post Views: 40








