ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు, హెచ్ఐవీ పై అవగాహన కోసం ఏర్పాటు చేసిన సంచార వాహనం సేవలను అనుమానితులు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ సూచించారు. సంచార వాహనంలోనే అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. గురువారం సంచార వాహనాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అదనపు డీఎంహెచ్ఓ గజానన్, డీఐఓ వైసీ శ్రీనివాస్, డీపీఏం నాగరాజ్, కార్యాలయ సూపరింటెండెంట్ గోపి, తదితరులున్నారు.
Post Views: 44







