Mahaa Daily Exclusive

  దావోస్ పర్యటనకు దారి ఖర్చులు కూడా రాలేదు – మాజీ మంత్రి అంబటి రాంబాబు

Share

విశాఖ ,ఎయిర్పోర్ట్ ,మహా :దావోస్ పర్యటనలో చంద్రబాబు బృందానికి దారి ఖర్చులు కూడా రాలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు “అన్నారు.
విశాఖ ఎయిర్పోర్ట్ కు విచ్చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా తో మాట్లాడారు దావోస్ పర్యటనకు వెళ్లి ఎన్ని కంపెనీలు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.
హైదరాబాద్ ని నేనే అభివృద్ధి చేశాను అనీ డబ్బా కొట్టుకున్న చంద్రబాబు దావోస్ వెళ్లి తీసుకొచ్చింది సున్నా అని ఎద్దేవాచేశారు.మా గుంటూరు సైడ్ ఒక సామెత ఉంది డొంక్క ఈతకి లంక మేత కి అన్నట్లు ఉంది ఈ దావోస్ పర్యటన అని సామెత లతో విమర్శించారు.ఒక మంత్రిమో దావోస్ వెళ్లి రెడ్ బుక్ కోసం మాట్లాడుతున్నాడు.దావోస్ వెళ్లి పరిశ్రమల కోసం మాట్లాడకుండా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని మాట్లాడుతున్నాడన్నారు.
ఏడు నెలలలోనే ఈ కూటమి ప్రభుత్వం బండారం బయట పడిందన్నారు.మా గుంటూరులో మరో సామెత ఉంది విశాఖపట్నంలో ఈ సామెత ఉందో లేదో తెలియదు కానీ “సింగడు అద్దంకి వెళ్లి వచ్చాడంట. ఎందుకెళ్లావంటే వెళ్లి రమ్మన్నారు వెళ్లి వచ్చాను అంతే అన్నాడట” అన్నట్టుగా ఉంది ప్రభుత్వం తీరు అంటూ ఎద్దేవా చేశారు. ఎవరు అభివృద్ధి చేసినా చేయకపోయినా హైదరాబాద్ తర్వాత సహజ వనరులు ఉన్న విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందన్నారు.రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నంనే ఐటి హాబ్ గా చేయాలని అనుకున్నారని గుర్తుచేసారు.నేచురల్ గా విశాఖపట్నంన్ని ఎవరు అభివృద్ధి చేసిన చేయకపోయినా అభివృద్ధి చెందుతుంది కానీ అమరావతిని ఎంత అభివృద్ధి చేసిన వరదలు వస్తే నీట మునగడమే తప్ప అభివృద్ధి చెందదని చెప్పారు.గత ప్రభుత్వంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తే ఆ మెడికల్ కాలేజ్ లను చంద్రబాబు ప్రైవేట్ సంస్థలకి అమ్మేస్తున్నారని ఆరోపించారు.