చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. చేనేత వస్త్రాలకు మార్కెట్లో డిమాండ్ పెంచడంతోపాటు వాటి మార్కెటింగ్ కోసం ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటామన్నారు. మరోవైపు టెక్స్‌పోర్ట్ కంపెనీ ప్రతినిధులు మంత్రిని కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో రూ.60 కోట్లతో చేపట్టిన దుస్తుల తయారీ యూనిట్ ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు.
Post Views: 88







