అదిలాబాద్ జిల్లా మావల మండలం బట్టిసావర్గాం పంచాయతీ దుబ్బగూడలో దాజీనగర్ ప్రభుత్వ పాఠశాల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కనీస వసతులు లేని చోట తరగతి గదుల నిర్వహణపై ముఖ్యమంత్రి ఆవేదన చెందారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వెంటనే స్థానికంగా అందుబాటులో ఉన్న తాత్కాలిక భవనం లో పాఠశాల నిర్వాహణ ఏర్పాటు చేయాలని విద్యా శాఖా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి పూర్తి నివేదిక తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దుబ్బగూడ పాఠశాల కు సంబంధించి శాశ్వత ఏర్పాట్ల కు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Post Views: 86







