ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. RTCలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల RTCపై సమీక్ష చేసిన CMచంద్రబాబు 2016కు ముందు చనిపోయిన వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800మందికి ఈ నిర్ణయం ఉపశమనం కల్పిస్తుందని అధికారులు తెలిపారు.
Post Views: 116







