Mahaa Daily Exclusive

  రేవంత్ ను దేవుడిని చేసిన కుమారీ ఆంటీ…!

Share

తెలంగాణ రాజకీయాల్లో తక్కువ టైంలో రాజకీయ చాణక్యంతో మొండి ధైర్యంతో పోరాడుతూ ఎదిగిన నేత రేవంత్ రెడ్డి. ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా అందరి ఆమోదంతో నామినేట్ అయ్యారు. తన ధైర్యసాహసాలతో ఇచ్చిన వాగ్దానాలతో ప్రజాదరణ పొందారు. ఆయన్ని అభిమానించే వారి సంఖ్య కాంగ్రెస్ లో పెరుగుతోంది. అయితే, ఇటీవల ఒక ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్ లో చిరు వ్యాపారం చేసుకునే కుమారీ ఆంటీ అనే మహిళ రేవంత్ రెడ్డిని దేవుడిలా కొలుస్తూ పూజలు చేస్తున్న ఘటన వైరల్ అయ్యింది.. హైదరాబాద్‌లో నివసించే కుమారీ ఆంటీ తనకు ఎంతో మేలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిని అత్యంత ఆరాధనతో పూజించడమే కాకుండా, ఆయన ఫొటోకు అర్చనలు చేస్తూ, దీపారాధనలు నిర్వహిస్తూ వార్తల్లో నిలిచారు. ఆమె మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి తెలంగాణ భవిష్యత్తును మార్చగల నాయ‌కుడు. ఆయన నాయకత్వంలో ప్రజలు సుఖంగా ఉండగలరు” అంటూ చెబుతోంది..

Latest