వీహెచ్‌పీ నేతల వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అందాల పోటీలను అడ్డుకొని వీహెచ్‌పీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని తెలిపారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలు మహిళల అభ్యున్నతికి ఏనాడు పాటు పడలేదని ఆరోపించారు. అందాల పోటీలు నిర్వహించే అవకాశం తెలంగాణ కు వస్తే అడ్డుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. పోటీలను వ్యతిరేకించడం వీహెచ్‌పీ నేతలు మానుకోవాలని అన్నారు. ప్రపంచ దేశాలలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్నింటిలో ముందంజ లో ఉందని తెలిపారు. మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది రేవంత్ సర్కార్ అని అన్నారు. అందాల పోటీల వలన మహిళల్లో ఆత్మ విస్వాసం పెరుగుతుందని, మీ రాజకీయల కోసం ఇలాంటి స్టేట్మెంట్స్ మానుకోవాలని వీహెచ్‌పీ నేతలను హెచ్చరించారు.







