ప్రయాగ్ రాజ్ ఎంటర్ ప్రైజ్ పేరుతో దీపక్ గోయల్ అనే వ్యక్తి మహా కుంభమేళాలో డిజిటల్ స్నానం చేయించే పని చేస్తున్నాడు. వాట్సాప్ లో ఫొటోలు పంపితే వాటిని డిజిటల్ ప్రింట్ తీసుకుని త్రివేణీసంగమంలో ముంచుతున్నాడు. ఇందుకు గానూ ఒక్కొక్కరికీ రూ.1100 వసూలు చేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుండగా, ఐడియా అదిరింది సర్ జీ అని కొందరు తెగ పొగిడేస్తున్నారు. మరికొందరు ధర్నాన్ని అపవిత్రం చేస్తారా అంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. డిజిటల్ స్నానం ఐడియా మాత్రం గోయల్ కు కాసులు కురిపిస్తోంది.
Post Views: 172







