కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న SLBC సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ అసమర్ధతకు, చేతగాని తనానికి నిదర్శనమని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టు పనులు ఆరంభంలోనే అంతం చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులదేనన్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావాలని, గాయపడిన క్షతగాత్రులకు వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలన్నారు. ఘటనపై NDSA దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Post Views: 48







