ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా రెండో విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు ఇది రెండో విజయం కాగా, పాకిస్థాన్‌కు రెండో ఓటమి. భారత్ తాజాగా విజయంతో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్‌పై ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కోహ్లీకిది వన్డేల్లో 51వ సెంచరీ కావడం విశేషం. అదే సమయంలో వన్డేల్లో వేగంగా 14 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. తాజా విజయంతో భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగవ్వగా, పాక్ దాదాపుగా టోర్నీ నుంచి నిష్ర్కమించింది.
Post Views: 177







