నెక్లెస్‌రోడ్డులో ఉన్న నీరా కేఫ్‌ను తొలగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు నీరా కేఫ్‌పై ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీరా కేఫ్‌ను మూసివేయాలనే ప్రతిపాదనలు తమకు లేవని స్పష్టం చేశారు. మొదటి నుంచి ఫుడ్ కోర్టులు కేఫ్‌లో భాగంగానే ఉన్నాయని తెలిపారు. నీరా కేఫ్‌ను తొలగించి అక్కడ హోటళ్లు ఏర్పాటుచేసే ప్రతిపాదనలు లేవని తేల్చిచెప్పారు. నీరా కేఫ్‌ను డాక్టర్ వినోద్ గౌడ్‌కు చెందిన మెస్సర్స్ తనీరా పామ్ ప్రొడక్ట్స్ డెవలప్‌మెంట్ సొసైటీ నిర్వహిస్తోందని తెలిపారు. నీరా కేఫ్ ఇప్పటికీ తన కార్యకలాపాలను కొనసాగిస్తోందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.
నీరా ఆరోగ్యానికి మంచిది
హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నీరాకేఫ్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాటిమొద్దులు, ఈత మొద్దులపై కూర్చోడానికి వీలుగా సీట్లను డిజైన్ చేశారు. వాటిపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ నీరా తాగడానికి ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి ఫుడ్ స్టాల్‌లో తెలంగాణ వంటకాలను సైతం వడ్డిస్తారు. ఒక్క మనాటలో చెప్పాలంటే గీత కార్మికుల అస్తిత్వానికి ప్రతీకగా నీరాకేఫ్ ఉంది. ఇతర పానీయాలతో పోల్చితే నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పటి వరకు కాంబోడియా, ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో నీరా ఉత్పత్తి అధికంగా ఉంది. హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన నీరాకేఫ్ నగరజీవులకు కొత్త రుచులు అందిస్తోంది. పక్కనే హుస్సేన్‌సాగర్.. చిటపట చినుకులు పడుతూ ఉంటే.. వెచ్చగ గొంతులోకి నీరా దిగుతూ ఉంటే.. చెప్పలేని ఆ హాయి కోసం ఇక్కడికి ఎంతోమంది వచ్చి సేద తీరుతుంటారు.







