Mahaa Daily Exclusive

  వైసీపీ పాలనలో పథకాల నిధులు దుర్వినియోగం: పయ్యావుల

Share

గత వైసీపీ పాలనలో భారీగా ప్రాయోజిత పథకాల నిధులు దుర్వినియోగం అయ్యాయని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. గతంలో కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.4,300 కోట్లు దారి మళ్లించారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ప్రత్యక్షంగా కన్నా పరోక్షంగా ఎక్కువ నష్టం వాటిల్లిందని విమర్శించారు. రాష్ట్ర వాటా నిధులు ఇవ్వనందుకు కేంద్రం రూ.300 కోట్ల మేర జరిమానా వేసిందని ఆయన తెలిపారు.