Mahaa Daily Exclusive

  నిబంధనలు అతిక్రమిస్తే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు: మంత్రి పొన్నం

Share

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించేవారి పట్ల రేవంత్ సర్కార్ కఠినంగా వ్యవహరించనుంది. ఈ మేరకు ఐదు సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే డ్రైవింగ్ లైసెన్స్ లు శాశ్వతంగా రద్దు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాంటి వారి లైసెన్స్ మళ్లీ పునరుద్ధరించరని, వాహనాలు కూడా వారి పేరిట రిజిస్ట్రేషన్ చేయబోమని చెప్పారు. ఈ నిబంధనలు అమల్లోకి తెస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు.