Mahaa Daily Exclusive

  ఏప్రిల్ 15 నుంచి రాష్ట్రంలో చేపల వేట నిషేధం..!

Share

ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మత్స్య సంపద వృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరబోట్లు, మెకనైజ్డ్, మోటార్ బోట్లతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీవో నం. 129 విడుదల చేశారు.