అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. ఈ విషాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు చనిపోవడం మరికొందరు తీవ్రంగా గాయపడడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Post Views: 13