ఒంగోలులోని తన కార్యాలయంలో టీడీపీ నేత వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణం అని, ఈ హత్య తనను షాక్‌కు గురిచేసింది మంత్రి నారా లోకేశ్ ‘X’ వేదికగా వెల్లడించారు. యువగళం పాదయాత్రలో తనతోపాటు అడుగులు వేసిన వీరయ్య పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేశారని గుర్తుచేశారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించామని, వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని లోకేశ్ తెలిపారు.
Post Views: 108








