జమ్మూకశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఉగ్రదాడి పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ ఉగ్రదాడిలో మరణించిన మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇలాంటి వాటిపై రాష్ట్ర, కేంద్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని పవన్ పిలుపునిచ్చారు.
Post Views: 94








