Mahaa Daily Exclusive

  బిచ్చమెత్తుకునే స్థితిలో ఉన్నా పాక్ మారలేదు: బండి సంజయ్

Share

MCRHRDలో నిర్వహించిన ‘రోజ్‌గార్’ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి బండిసంజయ్ పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన పహల్గామ్ దాడి గురించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉన్నా బుద్ధి మాత్రం మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధి చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతుందన్నారు. భారత్ ఆర్మీ పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెబుతుందని పేర్కొన్నారు.