Mahaa Daily Exclusive

  వెదర్ రిపోర్ట్.. తెలంగాణలో వర్షాలు..!

Share

తెలంగాణ‌లో ఆదివారం తేలిక‌పాటి నుండి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. క‌రీంన‌గ‌ర్, ములుగు,పెద్ద‌ప‌ల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల‌, జ‌గిత్యాల, జ‌య‌శంక‌ర్ భూపాల్ ప‌ల్లి, నిర్మ‌ల్, సిరిసిల్ల‌, నిజామాబాద్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఈ జిల్లాల్లో 50 నుండి 60 కి.మీ వేగంతో గాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. ఇక ఖ‌మ్మం, హైద‌రాబాద్, రంగారెడ్డి, మెద‌క్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.