Mahaa Daily Exclusive

  భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్‌ ఫిక్స్‌…!

Share

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ మధ్య టెన్షన్ వాతావరణ నెలకొంది. ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్‌లోని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ భారత్.. పాకిస్థాన్‌పై ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పారు. ” భారత్‌ నుంచి కచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుందని నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే భారత ప్రధాని మోదీ కూడా బిహార్‌లో చర్యలు తీసుకుంటామని ప్రకటన చేశారు. గతంలో పరిశీలిస్తే యూరీ, పుల్వామా దాడుల తర్వాత భారత్‌ చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. యూరీ దాడి తర్వాత 89లో భారత్‌ చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత 12 రోజుల్లోనే సర్జికల్‌ స్ట్రేక్ చేసింది. ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి జరిగింది కాబట్టి.. మే మొదటి వారంలో లేదా మధ్యన భారత్‌ దాడి చేసే అవకాశం ఉందని” అబ్దుల్ బాసిత్ అన్నారు. అంతేకాదు సింధు జల ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేయడం గురించి ఆయన మాట్లాడారు. పాకిస్థాన్ నీళ్లు లేకుండా మనుగడ సాగించడం కష్టమవుతుందని అన్నారు. దీనివల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని.. నదుల్లో నీరు ప్రవహించకపోతే రక్తం ప్రవహిస్తుందంటూ చెప్పుకొచ్చారు.