ఒక నియంత వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరు. మీరు అలా ఉండి మిమ్మల్ని విమర్శిస్తున్నారు. మేమే నియంతలమైతే ఈరోజు మీ సభ జరిగి ఉండేదా. అని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య హక్కు అందరికీ ఉంటుందని సభ సజావుగా సాగాలని ప్రభుత్వం సహకరించింది…కేసీఆర్ అది గమనించాలని సీతక్క మాట్లాడారు. మేము సభకు అనుమతిస్తే ముసలి కన్నీరు కారుస్తున్నావు. నీకు అధికారం పోయేసరికి ఆ బాధలో ఉండి మాట్లాడుతున్నావ్. అధికారం పోగానే అసెంబ్లీకి రానీ నువ్వు ఒక నాయకుడివా..అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరఫున మాట్లాడే వారే నిజమైన నాయకులు అని సీతక్క అన్నారు. అధికారం పోయింది అన్న బాధ తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే ఒక వాస్తవాన్ని ఆయన మాట్లాడలేదు. అధికారం పోయిన తర్వాత ఒక నియంత దొంగ ఏడుపు ఏడిస్తే ఎలా ఉంటుందో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసిఆర్. ఆయన ప్రసంగంలో పస లేదని సీతక్క విమర్శించారు.








