Mahaa Daily Exclusive

  పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తాం: సీఎం చంద్రబాబు

Share

అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 2024 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటంతో చట్టం చేయడం కుదరలేదని అన్నారు. మే 2న జరిగే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో రాజధాని రైతులకు ప్రత్యేక గాలరీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.